‘మేఘా’ పంపులతో ఉప్పొంగుతున్న గోదావరి

ఇంతకాలం గోదావరి నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం తెలంగాణకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు రాకతో తెలంగాణ నేల గోదారమ్మ జలదారల్లో తడిసి పులకించేందుకు, తెలంగాణ వ్యవసాయ భూములు పచ్చదనంతో కళకళలాడేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో 37 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు మంచినీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చనున్న బహుళార్ధక సాధక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. బీడువారిన చేకు నీరు అందించే విధంగా రైతుల్లో ఆశు చిగురింపచేస్తూ గోదావరి పరవళ్లకు వ్యతిరేక దిశలో కొత్త నడకు నేర్పుతూ నీటిని ఎగువకు పంపింగ్‌ చేయడంలో భూగర్భ గాయత్రి పంపింగ్‌ కేంద్రం గుండెకాయ వంటి పాత్రను పోషిస్తోంది ఇక్కడి నుంచి మిడ్ మానేర్ కు మరియు పునర్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టకు నీటిని తరలిస్తున్నారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం గంగ ఉప్పొంగుతోంది. వందల కిలో మీటర్ల మేర ప్రవహించి తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేస్తోంది. తెలంగాణ రైతులు ఎదుర్కునే సాగునీటి కష్టాలకు పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రాజెక్టు లింక్ 1 పనులు పూర్తి చేసుకొని ఎల్లంపల్లి రిజర్వాయర్ కు నీరు ప్రవహిస్తోంది. అక్కడినుంచి నందిమేడారం మీదుగా అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా గాయ్రతి భూగర్భ పంపింగ్ స్టేషన్ ద్వారా కాళేశ్వరం గంగా ఉప్పొంగి మిడ్ మానేరుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. కాళేశ్వర ఎత్తిపోతల పథకంతో మిడ్ మానేర్ కు మహర్దశ వచ్చింది

ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పంపింగ్‌ కేంద్రాన్ని నిర్మించడంలో ‘‘మేఘా ఇంజనీరింగ్‌’’ భూగర్భంలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. గాయత్రి పంప్ హౌస్ లో మొదటి దశలో రోజుకు 2 టిఎంసీల నీటిని పంపింగ్‌ చేసే విధంగా 5 మిషన్లను ఏర్పాటు చేయగా ఇప్పటికి నాలుగు మిషన్లు  వినియోగంలోకి తెచ్చింది. ఆగస్టు 11 నుండి ఇప్పటి వరకు కేవలం 22 రోజుల్లోనే 3 మోటార్లతో నిరంతరాయంగా నీటిని పంపింగ్ చేయడం ద్వారా దాదాపు 11.4 టీఎంసీల నీటిని మిడ్ మానేరుకు చేర్చింది. అందులో 5వ మిషన్‌ మొదట ప్రారంభించగా 380 గంటపాటు నిరంతరాయంగా పనిచేసింది (16 రోజుపాటు). 2వ మిషన్‌ (క్రమ సంఖ్య 4) అదే రోజుల్లో 378 గంటపాటు పనిచేసింది. ఈ రెండు మిషన్లు సరాసరిన ఒక్కొక్కటి 4.30 టిఎంసీ చొప్పున నీటిని పంప్‌ చేశాయి. మూడవ మిషన్‌ (క్రమసంఖ్య 1) 10 రోజుపాటు (అంటే ఆలస్యంగా ప్రారంభించారు) 248 గంటలు పనిచేసి 2.80 టిఎంసిల నీటిని పంప్‌ చేసింది.  ఈ పంపింగ్‌ కేంద్రం భూమి దిగువన 470 అడుగుల నుంచి నీటిని పైకి వెదజిమ్ముతోంది. భూగర్భంలో ఈ ‘మెగా’ మహాద్భుతాన్ని ఆవిష్కరించి  22 రోజులు కావస్తుండగా నీటి పంపింగ్‌ తీరు చూపరులను ఆకట్టుకుంటోంది. 327 మీటర్ల పొడవున నిర్మించిన ప్రపంచంలోనే పెద్దదయిన ఈ నిర్మాణంలో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లు (మోటారు, పంపు కలిపి ఒక్కో మిషన్‌) ఏర్పాటయ్యాయి. 2వ దశ కింద మరో రెండు మిషన్లు సిద్ధమవుతున్నాయి. వాటిలో ఒకటి డ్రైరన్‌ కూడా పూర్తయింది.

          ఈ పథకంతో పోల్చితే గాయత్రి (లక్ష్మీపూర్‌) భూగర్భ పంపింగ్‌ కేంద్రం భూమికి దిగువన 470 అడుగు లోతులో వుంది. అయినప్పటికీ 22 రోజుల్లో 1006 గంటలు పనిచేసి 11.40 టిఎంసిల నీటిని మిడ్‌ మానేరుకు చేర్చింది. మిడ్‌ మానేరు సామర్ధ్యం 25 టిఎంసిలు కాగా, అందులో అంత మొత్తం నీటిని 22 రోజుల్లో మూడు మిషన్ల ద్వారా చేర్చిందంటే ఈ మేఘా మిషన్ల విశిష్టత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజంగానే పట్టిసీమ లాగ 21,356 గంటు పనిచేస్తే ఎంత నీరు చేరుతుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంచుమించు 230 టిఎంసిల నీరు మిడ్‌ మానేరుకు చేరుతుంది. ఆ జలాశయం సామర్ధ్యం 25.60 టిఎంసిలు (పదో వంతు మాత్రమే). దీన్ని బట్టి చూస్తే ఈ పంపింగ్‌ కేంద్రం గొప్పతనం అర్ధమవుతుంది.

లింక్‌-1 లోని లక్ష్మీ (మేడిగడ్డ) పంపింగ్‌ కేంద్రం జున్‌ 21న ముఖ్యమంత్రు, నాటి గవర్నర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే! ప్రాణహిత నీటిని వెనక్కి ఒడిసిపట్టి ఎగువకు మళ్లించడంలో ఈ పంపింగ్‌ కేంద్రం కీలకమైనది. ఇందులో ఆరు మిషన్లు పనిచేస్తుండగా 36 రోజుల్లో 1593 గంటలు (అన్ని మిషన్లు కలిపి) నీటిని 12.20 టిఎంసిలు పంపు చేశాయి. ముఖ్యమంత్రు ప్రారంభించిన ఆరవ మిషన్‌ అత్యధికంగా 22 రోజుల్లో 367 గంటల పాటు 2.80 టిఎంసిల నీటిని పంపు చేసింది. దాదాపు అదే విధంగా 4, 3, 1, 5 మిషన్లు కూడా పనిచేశాయి. ఆస్యంగా ప్రారంభమైన 2వ మిషన్‌ ఇప్పటి దాకా (ఆగస్టు 31) 0.7 టిఎంసిల నీటిని అందించింది.

సరస్వతి (అన్నారం) పంపింగ్‌ కేంద్రం ఇప్పటి దాకా 6 మిషన్లను 16 రోజుల్లో 461 గంటల పాటు పనిచేయించి 4.86 టిఎంసి నీటిని పంపు చేసింది. అందులో ప్రధానంగా 1వ మిషన్‌ 8 రోజుల్లో 161 గంటలు పనిచేసి 1.70 టిఎంసిల నీటిని సుందిళ్లకు అందించింది. ఇక ఎల్లంపల్లికి నీటిని చేర్చి లింక్‌-1, లింక్‌-2 మధ్య అనుసంధానంగా వుండే పార్వతి (సుందిళ్ల) పంపింగ్‌ కేంద్రం 11 రోజుల్లో 23.67 గంటల పాటు ఆరు మిషన్లను పనిచేయించింది. ప్రస్తుతం గోదావరికి వరద వచ్చి ఎల్లంపల్లి నిండు కుండల ఉండడంతో సుందిళ్ల పుంపుహౌస్లోని మిషన్లను అప్పుడప్పుడు నడిపిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లోని  లింక్‌ 1 లో ఒక్కొక్క మిషన్‌ సామర్ధ్యం 40 మెగావాట్లు సామర్థ్యంతో  17 మిషన్లు వున్నాయి. మొత్తం సామర్ధ్యం 680 మెగావాట్లు. హంద్రీనీవా మాల్యా పంపింగ్‌ కేంద్రం మొత్తం సామర్ధ్యం 60 మెగావాట్లు. అంటే హంద్రీ-నీవా కంటే కాళేశ్వరం లక్ష్మీ పంపింగ్‌ కేంద్రం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులోని లింక్ 1లోని లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) మరియు గాయత్రి (ప్యాకేజీ 8) పంప్ హౌస్ ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తూ మేఘా ఇంజనీరింగ్ తన రికార్డులను తానే తిరగరాస్తుంది. ఇప్పటి వరకు అతి పెద్ద కేంద్రాలుగా ఆంధ్ర్రప్రదేశ్ లోని హంద్రీనీవా మొదటి దశలోని 12 కేంద్రాలు మరియు రెండవ దశలోనే 18 కేంద్రాల ద్వారా  2012 నుంచి అంటే 8 ఏళ్లు 1242 రోజుల పాటు పంపింగ్ జరుగుతన్నప్పటికీ  ఇప్పటి వరకు 163.4 టీఎంసీల నీటిని పంపింగ్ చేయడం జరిగింది.  అలాగే పట్టిసీమ నుంచి ఐదేళ్లలో 289 టీఎంసీల నీటిని పంపింగ్ చశారు. మేఘా నిర్మించిన కాలేశ్వరం లింక్ 1, లింక్ 2 లోని 4 పంపింగ్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తే తెలంగాణలో బీళ్లు బారిన లక్షల ఎకరాల భూములకు సాగునీరు చేరుతుందో అంచనా వేయవచ్చు.

కాళేశ్వరం లక్ష్యం నెరవేర్చడంలో మేఘా తన ప్రత్యేకతను అద్భుత పంపింగ్‌ ద్వారా చాటుకుంటోంది. ప్రారంభంలోనే అంత నీటిని అందిస్తుంటే భవిష్యత్తులో హంద్రీనీవా, పట్టిసీమ పథకా తరహాలో వే గంటు వంద రోజు పనిచేస్తే తెంగాణలో నీటి విప్లవం కళ్లెదుట కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!