కాళేశ్వరంలో మేఘా విద్యుత్

ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు విజయవంతంగా పూర్తి చేసిన ఎంఈఐఎల్‌ తాజాగా కాళేశ్వరంలో భారీ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొత్తం 4627 మెగావాట్ల విద్యుత అవసరంకాగా అందులో ఎంఈఐఎల్‌ 3057 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసే 6 సబ్‌స్టేషన్లు వాటి లైన్లను సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది.

ప్రపంచంలో ఇంతపెద్ద స్థాయిలో విద్యుత్‌ను వినియోగించే ఎత్తిపోతల పథకాలు ఇంతవరకు ఎక్కడా నిర్మించలేదు. ఆ ఘనత ఎంఈఐఎల్‌ దక్కించుకుంది. ఇది ఎంత పెద్ద విద్యుత్‌ వ్యవస్థ అంటే దేశంలోని జమ్ముకాశ్మీర్‌, బీహార్‌, ఈశాన్య రాష్ట్రాలకు సమానమైన విద్యుత్‌ వ్యవస్థను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది.

2017లో నాలుగు సబ్‌స్టేషన్ల పనులను తెలంగాణ ప్రభుత్వం ఎంఈఐఎల్‌కు అప్పగించగా రికార్డు సమయంలో అంటే 2019 మే నెలాఖరు నాటికి వరుసగా 6 సబ్‌స్టేషన్లను ఎంఈఐఎల్‌ అందుబాటులోకి తెచ్చింది.

కాళేశ్వరంలో ఏర్పాటుచేసిన విద్యుత్ వ్యవస్థ సామర్ధ్యం ఈశాన్య రాష్ట్రాల సరఫరా 3916 మెగావాట్లకు చేరువలో ఉండటం గమనార్హం. రెండేళ్లలోనే  260 కిలో మీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్లను ఏర్పాటు చేసి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా పనులు పూర్తి చేసి ఘనతను ఎంఈఐఎల్ ఖాతాలో వేసుకుంది. 400, 220కేవీ లాంటి అత్యధిక సామర్ధ్యం కలిగిన ఆరు సబ్ స్టేషన్లను అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ఎంఈఐఎల్ సత్తాను నిరూపించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ 8,10,11 పంప్ హౌజులలో మొత్తం 43 పంపు మోటార్లకు విద్యుత్ సరఫరా కోసం ఆరు విద్యుత్ సబ్‌స్టేషన్లను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులో ప్యాకేజీ 6,12,14 సబ్ స్టేషన్లు మినహా మిగతా అన్ని విద్యుత్ సరఫరా లైన్లు, సబ్ స్టేషన్లు ఎంఈఐఎల్ నిర్మించింది. ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కిన ప్యాకేజ్ 8 లోని పంప్ హౌజ్ లో ఒక్కో మోటార్‌ 139 మెగావాట్ల సామర్ధ్యంతో ఏడు బాహుబలి మోటార్లకు విద్యుత్ ను అందించేందుకు 400/13.8/11కేవీ సబ్ స్టేషన్, దానికి అవసరమైన 18 కిలో మీటర్ల 400 కేవీ క్యూఎండిసి ట్రాన్స్ మిషన్ లైన్‌ను రామడుగు సమీపంలో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది.

విద్యుత్‌ సబ్ స్టేషన్ల నిర్మాణం..

ప్యాకేజీ 8 పంపు హౌజ్ విద్యుత్ సరఫరా కోసం రామడుగు సబ్ స్టేషన్ 2017 ఫిబ్రవరి 22 పనులు ప్రారంభించి 2018 మే 6 ఛార్జ్ చేసారు.  సుందిళ్ల పంప్ హౌజ్ లోని తొమ్మిది యూనిట్లకు అవసరమైన 360 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం 400/220/11కేవీ సుందిళ్ల సబ్ స్టేషన్ 2017 జూలై 30 పనులు ప్రారంభించి 2018 జూలై18న ఎంఈఐఎల్‌ చార్జ్‌ చేసింది.  అన్నారం పంప్ హౌజ్ లోని 8 యూనిట్లకు అవసరమైన 320 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం 220 కేవీ అన్నారం సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. దీన్ని సుందిళ్లతో అనుసంధానిస్తూ 28 కిలో మీటర్ల టీఏండిసి ట్రాన్స్ మిషన్ లైను పనులను 2017 ఏప్రిల్ 1 ప్రారంభించి 2018 సెప్టెంబర్ 14 నాటికి పూర్త చేసి ఛార్జ్ చేసింది.

మేడిగడ్డ పంప్ హౌజ్ లోని 11 యూనిట్లకు అవసరమైన 440 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం 220 కేవీ సామర్థ్యంతో మేడిగడ్డ సబ్ స్టేషన్‌ను నిర్మించింది. దీన్ని సుందిళ్లతో అనుసంధానం చేస్తూ 80 కిలో మీటర్ల టీఏండిసి ట్రాన్స్ మిషన్ లైను పనులను 2017 ఏప్రిల్ లో ప్రారంభించి 2018 సెప్టెంబర్ 29 నాటికి పూర్తి చేసింది. ప్యాకేజీ 10 పంప్ హౌజ్ లోని మొత్తం 425 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్లకు విద్యుత్ సరఫరా కోసం 400/11 కేవీ తిప్పాపూర్ సబ్ స్టేషన్ పనులను 2017 నవంబర్ 8 ప్రారంభించి 2019 ఏప్రిల్ 29 మెయిల్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.  ప్యాకేజీ 11 రంగ నాయక సాగర్ పంప్ హౌజ్ లోని 541 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్లకు విద్యుత్ సరఫరా కోసం చందూలపూర్ వద్ద 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ పనులను 2017 మే నెలలో ప్రారంభించి 2091 మే 6 నాటికి మెయిల్ పూర్తి చేసిన రికార్డును సొంతం చేసుకుంది.

మౌలిక వసతుల రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఎంఈఐఎల్ రికార్డులు చేరగని ముద్రను వేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు ఎంఈఐఎల్ సబ్ స్టేషన్ల పనులను పర్యవేక్షిస్తూ సకాలంలో కంటే ముందుగానే పనులను పూర్తి చేయడాన్ని ఎంఈఐఎల్ ఓ అలవాటుగా మార్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!