వంటకు మేఘా గ్యాస్ ప్రవాహం

మేఘా ఇంజనీరింగ్‌ గ్రామీణ ప్రాంతంలోని ప్రతీ ఇంటికి పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ అందించానే లక్ష్యంతో పనిచేస్తోంది. వాణిజ్య, గృహ, పారిశ్రామిక అసరాలకోసం ఇప్పటికే పైపుల ద్వారా నేచురల్‌ గ్యాస్‌ను సరఫరా చేస్తున్న మేఘా ఇంజనీరింగ్‌ దానిని విస్తరించేందుకు ఎంఇఐఎల్‌ హైడ్రోకార్బన్‌ డివిజన్‌ ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంది. ఆటోమోబైల్‌ రంగంలో గ్యాస్‌ సరఫరా కోసం 9 సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేసిన మేఘా తాజాగా మరో 5 స్టేష్లన్ల వచ్చే మూడు నెలో ప్రారంభించనుంది. అలాగే పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 16 జిల్లాల్లో గ్యాస్‌ పంపిణీ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతులను పొందింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చటంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్‌ నాచురల్‌ గ్యాస్‌ (సిఎన్‌జి)ని అందిస్తోంది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

వ్యూహాత్మకంగా మేఘా అడుగులు

ఓఎన్‌జీసి నుంచి నాగాయలంక, వెస్ట్‌ పెనుగొండ ఆన్‌షోర్‌ గ్యాస్‌క్షేత్రాలను పొందిన మేఘా ఇంజనీరింగ్‌ ఇక్కడి నుంచి రోజుకు లక్షా 30 వేల ఎన్‌సీఎం గ్యాస్‌ను తరలించేందుకు ఏర్పాటు చేసింది. ఇందుకోసం అమెరికా నుంచి రప్పించిన అత్యాధునికి మెకానికల్ రిఫ్రిజేషన్‌ యూనిట్లు, కంప్రెసర్లను వినియోగిస్తున్నది. నాగాయలంక క్షేత్రాన్ని ఇప్పటికే ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గ్యాస్‌ను ఎంఈఐఎల్‌ పంపిణీ  చేస్తోంది. అలాగే తెలంగాణలోని పరిశ్రమలకు  కూడా అందించాలని ఎంఈఐఎల్‌  ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే వినియోగదారులకు గ్యాస్‌ సరఫరా చేసేందుకు 1200 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను వేసింది. భవష్యత్తు అవసరాల కోసం మరో 5000 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను మూడు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం కృష్ణ జిల్లాలో  13 వేల మంది గృహ వినియోగదారులకు పైపుల ద్వారా నేచురల్‌ గ్యాస్‌ను పంపిణీ చేస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన స్టేషన్‌ నుంచి గ్యాస్‌ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు 571 కిలోమీటర్ల మేర పైప్‌లను ఏర్పాటు చేసారు. ఆటోమోబైల్‌ రంగానికి ఇప్పటికే 9 సీఎన్‌జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా రాబోయే మూడు నెలల్లో మరో ఐదు సీఎన్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ కొత్తగా ఏర్పాటు చేయబోయే సీఎన్‌జీ స్టేషన్ల ద్వారా మూడు లక్షల ఎస్‌సీఎం గ్యాస్‌ను ఎంఇఐఎల్‌ సరఫరా చేయనుంది. ఈ నెలాఖరుకు మరో రెండు వేల మంది వినియోగదారులకు పీఎన్‌జీ ని పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వాణిజ్య వినియోగదారులకు ప్రతినెలా 60 వేల ఎస్‌సీఎం (స్టాండర్డ్ క్కుబిక్ మీటర్ ) గ్యాస్‌ను పంపిణీ చేస్తున్నది. త్వరలో మరో పదిమంది వాణిజ్య వినియోగదారులకు ప్రతినెలా లక్ష ఎస్‌సీఎంల గ్యాస్‌ను సరఫరా చేసేందుకు రంగం సిద్ధం అయింది.

తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌ అర్భన్, వరంగల్‌ రూరల్, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి త్వరలో గ్యాస్‌ పంపిణీకి సన్నహాలను చేస్తున్నది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో 12 కిలోమీటర్ల మేర పైపులైను వేయగా వచ్చే మూడు నెలల్లో మిగతా జిల్లాల్లో పైప్‌లైను పనులను విస్తరించి సేవలను ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నది.

దూసుకెళ్తున్న మేఘా గ్యాస్

అలాగే కర్నాటకలోని తూంకూరు, బెల్గాం జిల్లాల్లో అంచనాలకు మించి డిమాండ్‌ ఉంటోంది. తూంకూరు జిల్లాలోనే మొత్తం 12,500 మంది వినియోదారులకు ప్రస్తుతం పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ సరఫరా అవుతుండగా ఈ నెలఖరునాటికి మరో నాలుగు వేల గ్యాస్‌ కనెక్షన్లను ఎంఇఐఎల్‌ ఇవ్వనుంది. వాణిజ్య వినియోగదారుల నుంచి ప్రతి నెలా లక్షా 40 వేల ఎస్‌సీఎం గ్యాస్‌ను పంపిణీ చేస్తుండగా, త్వరలోనే ఈ డిమాండ్‌ రెట్టంపు కానుంది. బెల్గాం జిల్లాలో ఇప్పటికే 15వేల మంది వినియోగదారుకు పీఎన్‌జీని సరఫరా చేస్తుండగా త్వరలో మరో 2500 వేల మందికి సరఫరా చేసేందుకు రంగం సిద్ధం అయింది.  ఈ జిల్లాలో వాణిజ్య వినియోగదారులకు సరఫరా చేస్తున్న గ్యాస్‌ నెలకు 2,10,000ఎస్‌సీఎంకు చేరుకుంది. సమీప భవిష్యత్‌లో మరో మూడు లక్షల ఎస్‌సీఎం గ్యాస్‌ సరఫరా అవకాశం వుంది. ఈ రెండు జిల్లాల్లో నాలుగు సీఎన్‌జీ స్టేషన్లను ఏర్ప్నాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. పరిశ్రమల్లో నేచురల్‌ గ్యాస్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను పరిశ్రమ కోసం ప్రత్యేక ప్రణాళికను మేఘా గ్యాస్‌ రూపొందించింది. అతి తక్కువ పెట్టుబడి అవసరమయ్యే ఆకర్షణీయ ప్యాకేజీతో పథకాలను సిద్ధం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!