130 ప్రాజెక్టులు పూర్తితో ఎంఈఐఎల్ ఘనత

ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల‌్ గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, గ్యాస్ ప్రాసెసింగ్,  గ్యాస్ పంపిణీ తదితర రంగాలలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టులను నిర్ణీత గడువు కన్నా ముందే నాణ్యతతో రాజీపడకుండా పూర్తి చేయడం ఎంఈఐఎల‌్ ప్రత్యేకత. రికార్డు సమయంలో 400 220 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్,  ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంఈఐఎల‌్ ఎక్కింది. అలాగే రాగేశ్వరీ వద్ద గ్యాస్ ప్రాసిసింగ్ యూనిట‌్‌ను కూడా కేవలం ఆరునెలల కాలంలోనే నెలకొల్పి రికార్డులను తిరగరాసింది.

ఎంఈఐఎల్ పూర్తి చేసిన ప్రాజెక్టుల వివరాల్లోకి వెళ్తే ముందుగా ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎంఈఐఎల్ సొంతం.  తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఒకటో లింక్ సబ్ స్టేషన్ నిర్మాణం పనులు పూర్తి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 8లో భాగంగా రామడుగు 400కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. ఈ సబ్ స్టేషన్ ప్యాకేజ్ 8కి అనుసంధానంగా భూగర్భంలోన్న 7 పంపింగ్ మోటార్లకు విద్యుత్ సరఫరా చేస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్దవి అయిన  ఈ మోటార్లు 139 మెగావాట్ల సామర్థ్యంతో పని చేయనున్నాయి.   ఎంఈఐఎల్‌ పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్ట్‌లో కొన్ని పూర్తిస్థాయిలోని ప్రాజెక్టులుగా కాగా మరికొన్ని ప్రాజెక్ట్‌ల్లో భాగమైన  నిర్దేశించిన పనికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్‌గానే పరిగణిస్తారు.

తెలంగాణలో ప్రపంచ స్థాయిలో భారీ పంపులు నిర్మాణం ఓవైపు పూర్తి చేయగా మరో వైపు జెట్ స్పీడ్ లో ఉత్తర భారత దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో రాగేశ్వరీ గ్యాస్ టెర్మినల్ ప్లాంట్ నిర్మాణం ఆరు నెలల్లోనే ఎంఈఐఎల్ పూర్తి చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. కైర్న్ ఇండియా నుంచి ఎంఈఐఎల్ ఆగష్టు2018లో గ్యాస్ ప్రాసెసింగ్ ప్రాజెక్టును తీసుకుని సెప్టెంబర్ 2018లో పనులు ప్రారంభించి అతి తక్కువ సమయంలో మార్చి 2019 నాటికి కేవలం ఆరు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టులో గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్ సామర్థ్యం 80 ఎంఎంఎస్‌సీఎఫ్ఈడీ. ఎంఈఐఎల్ ఈ గ్యాస్ ప్రాజెక్టు రికార్డు సమయంలో పనులను పూర్తి చేసేందుకు యుద్ధ ప్రతిపాదికన నిర్మాణానికి అవసరమైన సామగ్రి సేకరణ, ఇంజనీరింగ్ విధానం, అమలు బాధ్యతలను సమన్వయం చేసింది. 18 నెలల పాటు ఈ ప్రాజెక్టు నిర్వహణ భాద్యతలు కూడా ఎంఈఐఎల్ పర్యవేక్షించనుంది.

ఇక విద్యుత్ పంపిణీ ప్రాజెక్టుల్లో  సుందిళ్ల పంప్ హౌజ్ సమీపంలో కూడా 400/220కెవి విద్యుత్ సామర్థ్యంతో సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసింది.  ఈ సబ్ స్టేషన్ నుంచి సుందిళ్ల పంప్ హౌజ్‌కు, అలాగే అన్నారం,  మేడిగడ్డ సబ్ స్టేషన్లకు 220కెవి విద్యుత్ సరఫరా జరగనుంది. అన్నారం సబ్ స్టేషన్ 220కెవి నుంచి అన్నారం పంప్ హౌజ్ లోని 8 యూనిట్లకు అలాగే మెడిగడ్డ సబ్ స్టేషన్ 220కెవి నుంచి మెడిగడ్డ పంప్ హౌజ్ లోని 11 యూనిట్లకు విద్యుత్ సరఫరా కానుంది.

ఎంఈఐఎల్ తాగునీటి సరఫరా పథకాల్లో కూడా అల్ టైం రికార్డు స్థాయిలో నిర్మాణ పనులను పూర్తిచేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలోని నీటిని శుద్ది చేసేందుకు పొదలకూరు మండలంలోని విరువూరు వద్ద మూడు టర్బైన్ పంపులను 544 కిలోవాట్ల సామర్థ్యంతో పంప్ హౌజ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ పథకంలో నెల్లూరు నగరంతో పాటు పరిసర గ్రామాల్లోని 70వేల గృహాలకు శుద్ధిచేసిన తాగునీరు అందించనున్నారు. మహమాదాపూర్‌లో 122 లీటర్ల నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నీటి సరఫరా కోసం 40కిలో మీటర్ల ఎంఎస్ పైపు లైను మరియు 88.90 కిలో మీటర్ల డీఐ పైపు లైను నిర్మాణం జరిగింది. ఎంఈఐఎల్ ఐదేళ్లపాటు ఈ నీటి సరఫరా నిర్వహణ బాధ్యతలను కూడా నిర్వర్తించనుంది.

ఎంఈఐఎల్ దేశంలోనే అత్యధికంగా తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంను పూర్తి చేసింది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కరీంనగర్ పేజ్-1, సిరిసిల్ల, వేములవాడ మరియు చొప్పదండి, పెద్దపల్లి-రామగుండం, కోరుట్ల, జగిత్యాల మరియు ధర్మపురి, మహబూబ్ నగర్, మంథని-భూపాలపల్లి, ఆలేరు-నల్గొండ, పాలేరు-వరంగల్, నిజామాబాద్-సింగూర్, ఎస్ఆర్ఎస్పీ-ఆదిలాబాద్ పేజ్ 2, ఆదిలాబాద్ పేజ్1, దుమ్ముగూడెం-పూసురు, మంగపేట సెగ్మెంట్లలో తాగునీటి సరఫరా పనులను పూర్తి చేసింది.

ఎంఈఐఎల్ తాగునీటి పథకాల్లోనే కాకుండా సాగునీటి ప్రాజెక్టులను కూడా గడువు వ్యవధిలోనే పూర్తి చేసి ప్రాజెక్టులను అమలులోకి తీసుకువచ్చిన ఘనతను సాధించింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు నీరు కోసం ఎత్తిపోతల పథకాల్లో భాగంగా పురుషోత్తపట్నం పేజ్1, పేజ్2, కొండవీటి వాగు, చింతలపూడి, హంద్రీ-నీవా సుజల స్రవంతి పేజ్2 లను రికార్డు సమయంలోనే  పూర్తి చేసింది. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తూరు, కోలార్, దాసరి హళ్లి, కాన్వా ఎత్తిపోతల పథకాలను,  గుజరాత్ రాష్ట్రంలో ఆరు ఎత్తిపోతల పథకాలు అలాగే ఒరిస్సాలో కూడా ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను ఎంఈఐఎల్ విజయవంతంగా పూర్తి చేసింది.

ఎంఈఐఎల్ విద్యుత్ ట్రాన్స్ మిషన్ విభాగంలో నిర్మాణం పనులను పూర్తి చేయడం, కేటాయించిన సమయంలోనే పథకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.  అందులో నర్సాపూర్ లిలో లైన్, కలికిరి, గజ్వేల్, కేతిరెడ్డిపల్లి, మహేశ్వరం, పొదిలి-సత్తేనపల్లి సబ్ స్టేషన్లను  నిర్మించిన ఘనత ఎంఈఐఎల్ దే.

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో వైటీపీఎస్-జీఎండబ్ల్యూ ప్రాజెక్టును నిర్ధేశించిన సమయం కంటే ముందుగానే ఎంఈఐఎల్ పనులు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు కృష్ణా నది నుంచి నీళ్లను తీసుకుని వైటీపీఎస్కు సరఫరా చేస్తోంది. ఏర్మరస్ ధర్మల్ పవర్ స్టేషన్ వీలైనంత తక్కువగా నీళ్లను వాడటమే లక్ష్యంగా పనులు చేస్తోంది.
ఎంఈఐఎల్ కృష్ణ నది గట్టుపై వంతెనతో పాటు నీళ్ల పంప్ హౌజ్ నిర్మించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర, జాతీయ రహదారులతో పాటు రైల్వే ట్రాకులకు ఎలాంటి ఆటంకం లేకుండా పైప్ లైన్లను వేయడం జరిగింది.

నీటి సరఫరా పథకాల్లో భాగంగా రాజస్థాన్ లోని అసిండ్, కోట్రీ, శహపురా, పాలి ప్రాంతాలు, ఒరిస్సాలోని  భువనేశ్వర్, కియోంజర్ నగరాలకు, ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి, ఆగ్రాలో  నీటి సరఫరా పథకాల నిర్మాణం పూర్తి చేసి విజయవంతంగా ఎంఈఐఎల్ నిర్వహిస్తోంది.

అలాగే పశ్చిమ భారతదేశంలోని గుజరాత్‌లో నర్మదా నదిపై సర్ధార్ సరోవర్ ప్రాజెక్టులో భాగమైన సౌరాష్ట్ర కాలువపై రెండు జల విద్యుత్ ప్రాజెక్టులను ఎంఈఐఎల్ పూర్తి చేసి జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది. మూడింటి యూనిట్లలో రెండు పూర్తవగా, మరోకటి అతి త్వరలో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 45 మెగావాట్లు కాగా ఒక్కో యూనిట్‌లో 5 మెగావాట్ల సామర్థ్యం గల 3 టర్బైన్లతో 15 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టుల  నిర్వహణ బాధ్యతలను ఎంఈఐఎల్ ఐదేళ్ల పాటు చూడనుంది.

ఎంఈఐఎల్ దేశ ప్రజలకు నిత్యావసరలైన తాగు, సాగు నీరు సరఫరా, విద్యుత్ ఉత్పత్తి, గ్యాస్ ప్లాంట్ పథకాలను ఎలాంటి ఆటంకం, ఆలస్యం చేయకుండా నిర్ధేశించిన  గడువులోగానే పూర్తి చేయడం, ప్రభుత్వ పథకాలను అమలులోకి తీసుకువచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!