మేఘా రాకతో పోలవరం పరుగులు

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ఇక మేఘా రాకతో పరుగులు పెట్టనుంది. దేశంలో ఎన్నో క్లిష్టమైన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి రికార్డులకెక్కిన మేఘా ఇంజనీరింగ్‌ ఇక పోలవరాన్ని కూడా తన ఇంజనీరింగ్‌ అనుభవంతో లక్ష్యం మేరకు పూర్తి చేయాలని శరవేగంగా సిద్ధం అవుతోంది. ఇన్నాళ్లు పనులు చేయడానికి అడ్డంగా ఉన్న స్టే అక్టోబర్‌ 31నాడు హైకోర్టు ఎత్తివేయడంతో పనులు చేయడానికి మార్గం సుగమం అయ్యింది. తెలంగాణలోని కాళేశ్వరాన్ని తన శక్తిమేరకు గడువులోగా పూర్తిచేసిన మేఘా ఇక పోలవరాన్ని కూడా తన సాంకేతిక వనరులతో రికార్డు సమయంలో  పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతోంది. శుక్రవారం  నవంబర్ 1 న స్పిల్‌ వే బ్లాక్‌ నంబర్‌ 18 వద్ద మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ డిజిఎం ఎ. వెంకట సతీష్‌, మేనేజర్‌ పమ్మీ మురళి, జలవనరుల శాఖ ఈఈ ఏసుబాబు సమక్షంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈలు శేఖర్‌బాబు, మళ్లీఖార్జున్‌, సుధాకర్‌బాబు, పాండురంగయ్య, డిఈలు రామేశ్వర్‌నాయుడు, బాలకృష్ణ, లక్ష్మణ్‌, ఏసుదాసు, యశోధరావు, శ్రీనివాస్‌, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టును కాళేశ్వరం తరహాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారు. అందువల్లనే గత ప్రభుత్వంలో నత్తనడకన పనులు చేయడం వల్ల  వాటిని రద్దు చేసి మొత్తం ఒకేపనిగా టెండరును పిలిచారు. రెండేళ్లలో మొత్తం ప్రాజెక్టు పూర్తికావాలనేది జగన్ ఆకాంక్ష, లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్  రాజశేఖర్ రెడ్డి 2005లో పనులు ప్రారంభిస్తూ హెడ్వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులను ప్యాకేజ్ వారిగా అప్పగించారు. అదే సమయంలో ఆయన కీలకమైన అన్ని అనుమతులను సాధించారు.

రివర్స్టెండర్తో ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా

పోలవరం హెడ్‌వర్క్‌తో పాటు జల విద్యుత్‌ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్‌ టెండర్‌కు పిలిచిన విషయం తెలిసిందే. ఈ రివర్స్‌టెండర్లో మేఘా ఇంజనీరింగ్‌ గతంలో పనులు చేసిన సంస్థకన్నా తక్కువ శాతంకు టెండర్‌ వేసి ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా చేసింది. ఓ వైపు ప్రధాన రిజర్వాయర్‌తో పాటు జల విద్యుత్‌ కేంద్రాన్ని ఏకకాలంలో నిర్మించడానికి మేఘా ఇంజనీరింగ్‌ అన్ని ఏర్పాట్లను చేసుకుంటోంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తన ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాలనే పట్టుదలతో పనులు మొదలుపెడుతోంది.

అతితక్కువకు మేఘా టెండర్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పనును రద్దు చేసి రివర్స్‌ టెండర్కు వెళ్లి, పోలవరం హెడ్వర్క్స్తో తో పాటు జల విద్యుత్‌ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్‌ టెండర్‌ పిలిచింది. ఈ టెండర్లో మేఘా ఇంజనీరింగ్‌ గతంలో పనులు చేపట్టిన సంస్థల కంటే తక్కువ శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628 మొత్తంలో నిధులు  ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో జల విద్యుత్‌ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్‌ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్‌ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్‌ ఒక్కటే 4358 మొత్తానికి టెండర్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో వడివడిగా అడుగులు వేస్తోంది ఎంఇఐఎల్ .

పోలవరం ప్రాజెక్టును 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన కృష్ణా నదికి తరలించటం, కృష్ణ-గోదావరి డెల్టాలోని రెండు పంటలకు నీరందిచేలా ఆయకట్టు స్థిరీకరణతో పాటు 23.44 టీఎంసీల  నీటిని విశాఖపట్నం నగర తాగునీటి అవసరాల నిమిత్తం తరలించటం, పోలవరం కాలువకు అనుకుని ఉన్న 540 గ్రామాల్లోని 28.5 క్ష మంది ప్రజ దాహార్తిని తీర్చేందుకు నిర్మిస్తున్నారు.

సర్వే, వనరుల సమీకరణ ముఖ్యంగా ఇంజనీరింగ్‌ యంత్రాంగం, యంత్ర సామాగ్రితో పాటు అవసరమైన ముడిసరుకు తదితర పనులను మేఘా ఇప్పటికే చురుగ్గా చేపట్టింది. వరదలు దాదాపు నిలిచిపోవడంతో పనులు ప్రారంభించడం కూడా సులభం కానుంది. ఓ వైపు ప్రధాన రిజర్వాయర్‌ పనులు, మరోవైపు జల విద్యుత్‌ కేంద్రం పనులు ఏకకాలంలో చేపడుతోంది. గతంలో ప్రధాన జలాశయం పనులు కొంతమేర జరిగినప్పటికీ జల విద్యుత్‌ కేంద్రం పనులు మాత్రం ఏమాత్రం ముందుకు సాగలేదు. ప్రారంభదశలోనే ఉన్నాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!