వెలుగు లోకి వచ్చిన tv9 బహిష్కృత రవిప్రకాష్ బోనస్ భాగోతం

మెరుగైన సమాజం‌కోసం‌ అంటూ tv9  లో వున్నన్ని రోజులు సీఈఓ హోదా రవిప్రకాష్ చేసిన మోసాలు ,దందాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.అయితే  సొంత ఉద్యోగులకే సున్నం‌పూసేశాడు ఈ ఖైదీ నెంబర్ 4412.ఉద్యోగుల బోనస్‌ను కూడా మింగేశాడు.

టీవీ9 అమ్మకం పూర్తైన  దశాబ్దకాలంగా సంస్థ నే నమ్ముకున్నందుకు  ఎంతో కొంత బోనస్‌ రూపంలో వస్తుందని ఉద్యోగులంతా వేయి కళ్లతో ఎదురు చూశారు. కనీసం ఒక నెలా జీతమైనా బోనస్‌ రూపంలో అదనంగా వస్తుందేమో అని ఆశపడ్డా అని ఆశించారు.కానీ వాళ్ల ఆశలపై కూడా జెల్ల కొట్టారు రవిప్రకాష్ బ్యాచ్  బోనస్ గా ఎంత వచ్చిందో, ఎంత నొక్కారో ఇప్పటికీ లెక్కలు తేలడం లేదు. నెంబర్‌ వన్‌ ఛానల్‌ అని, తానో మీడియా లెజెండ్రీ అని చెప్పుకునే  ఆర్పీ సీక్రెట్‌గా కవర్లలో పెట్టి,  లెక్కలు లేకుండా బ్లాక్ మనీను తన వాళ్లకు మాత్రమే (అందులోనూ కోత పెట్టారు అది వేరే విషయంఅనుకోండీ) డబ్బులు ఇచ్చారు. నీతి, నిజాయితీ, న్యాయం, చట్టం, సెక్షన్లు అని ఉదయం నుండి రాత్రి వరకు రామకోటి లా  మాట్లాడే ఈ మనిషి చానల్‌ మొదటి నుంచి పని చేస్తున్న వారికి సైతం ఎందుకు డబ్బులు ఇవ్వలేదు?ఆర్పీని తొలగించిన తర్వాత ఈ విషయం బయట పడటంతో ఉద్యోగుల నుంచి ఇతడికి ఏ మాత్రం సానుభూతి రాలేదు. పైగా కోపం మరింత పెరిగింది. *మన కడుపు కొట్టాడు కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని టీవీ9 ఉద్యోగులంతా చెప్పుకునే పరిస్థితి. రవిప్రకాష్ తోటి ఉద్యోగులకు రావాల్సిన బోనస్ ను కూడా నొక్కేశాడని తెలిసిన  ఆర్పీ కుడి చేయి తాజా గా విడుదల చేసిన వీడియో లో ప్రస్తుతTV9 ఉద్యోగులపై నోటికొచ్చినట్టు మాటాడిన మాటలు కూడా ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగులను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.

ఉద్యోగులకు మాత్రం సగం బోనస్సే

ఆరున్నర కోట్లను బోనస్‌గా తీసుకున్న ఆర్పీ… టీవీ9 చరిత్రలో ఉద్యోగులకు బోనస్‌ ఇచ్చింది కేవలం రెండే రెండు సార్లు. అది కూడా ఒకసారి సగం నెల జీతం మాత్రమే. బోనస్‌ ఇచ్చిన ఏడాది జీతాల పెంపు లేదు. అదేమంటే బోనస్‌ ఇచ్చాం కదా అనే సమాధానం వచ్చిందట. 2014 తర్వాత మూడేళ్లు వరుసగా జీతాలు పెంచలేదు.

ఇదో రకం దందా

బోనస్ ఇవ్వకుండా ఆ సొమ్ములను సొంత మనుషుల జేబుల్లో నింపాడు మిస్టర్ చీటర్. తన వేగులకు టీవీ9 నుంచి జీతాలు కూడా ఇచ్చి వారిని తన సొంత పనులకు వాడేశాడు. సీఈవోగా సంస్థలో తనమాటే  చెల్లుబాటు అవుతుందని అనుకుందాం. కానీ ఉన్న ఉద్యోగులను సైతం హ్యాపీగా ఉంచాడా? అంటే లేదనే సమాధానం వస్తుంది. తనకు భజన చేసే వారికి, తాను నమ్మిన వారికి, తనకు మూటలు తెచ్చి ఇచ్చే వారిక మాత్రమే న్యాయం చేశాడు. ఎంతలా అంటే… రవిప్రకాశ్‌ను పీకేసే వరకు చాలా మంది పని చేయకుండానే నెలానెలా వేలు, లక్షల జీతాలు tv9 నుంచే తీసుకున్నారు. మిస్టర్‌ ఛీటర్‌కు, బయట వ్యవహారాలు చూసే వాళ్లను ఉద్యోగులుగా చూపి నెలనెలా జీతాలు అందించిన చరిత్ర రవిప్రకాష్ ది.  

అసలు ఉద్యోగులు ఎవరో, పని చేయని వారు ఎవరో తెలియక కొత్త యాజమాన్యం లెక్కలు తేల్చుకునే సరికి నమ్మకద్రోహి రవి ప్రకాష్ అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. తనకు ఇప్పుడు కోవర్ట్ గా వ్యవహరిస్తోన్న ఓ సీనియర్ యాంకరమ్మ, మేకప్ ఇంచార్జ్  ల కు మొత్తం అన్ని భాషల్లో వున్న tv9 అఫీసుల్లో  మేకప్ వేసే మెటీరియల్ కాంట్రాక్టు లో  కూడా బాగానే దోచేసిన వైనం పై చర్చ జరుగుతోంది. తనకు కుడి చెంచాగా వుండే ఓ మేకప్ హెడ్  పేరు మీద ఈ దందా *ఏళ్ల తరబడిగా నడుపుతూ నెలకు ఒక్కో చానెల్ తరపున  కేవలం మేకప్ కోసమే 5నుండి 8 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్టు సొమ్ములు డ్రా చేసి దొంగ లెక్కలు చూపారంటే ఇక మిగిలిన వాటిలో ఇంకెంత దోపిడి జరిగిందో ఊహించుకోవచ్చు.ఇక డ్రైవర్లు, ఆఫీస్‌ బాయ్‌లు, హౌస్‌కీపింగ్‌ ఉద్యోగులు… ఇలా చాలా మందే టీవీ9 నుంచి జీతాలు తీసుకుని ఆర్పీ సొంత పనులు చేశారు.  ఈ అక్రమ నియామకాలు,దోపిడీ అంతా  ఆర్పీని బహిష్కరించిన  తర్వాత బయటపడ్డాయి. అవే ఉన్న ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.

అడ్డంగా దొరికిపోయాక బోనస్‌ రూపంలో (ట్యాక్స్‌ కాకుండా) రూ.6.50 కోట్లను ఆర్పీ తన ఖాతాలో వేసుకున్నాడన్న విషయం తెలిశాక టీవీ9 ఉద్యోగుల్లో ఆగ్రహం మరింత మండిపడుతున్నారు ఉద్యోగులు. మూర్తికి మరో ఐదున్నర కోట్లను కట్టబెట్టాడు. ఇదంతా వైట్‌ మనీ. బ్లాక్‌ ఎంత తిన్నాడో ఎవరికీ తెలియదు. ఆర్పీ అరెస్ట్‌తో టీవీ9 ఉద్యోగుల నుంచి ఏ మాత్రం సానుభూతి రాకపోవడానికి కారణం ఇదే. ఉన్నన్ని రోజులూ జీతాలు సరిగ్గా పెంచక, పెంచినా తన వారికే ఎక్కువ ఇచ్చి, చాలా మందిని నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి పీకేసి, కొంతమందికి జీతాలు కోసేసి ఒకటా రెండా… చాలా దారుణమైన ఉద్యోగ వ్యతిరేక చర్యలు ఆర్పీపై ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.పైగా తమ ఉసురు తగిలిందని పనిని,సంస్థ నే నమ్ముకున్న ఉద్యోగులు శాపాలు కూడా పెడుతున్నారంటే రవిప్రకాష్ దోపిడీ ఎంతలా జరిగిందో ఊహించుకోవచ్చు.

మరుగుదొడ్ల పనుల్లో  కూడా కక్కుర్తి

రవిప్రకాశ్‌ సీఈవో ఉన్నన్ని రోజులూ ఆఫీసులో ఏదో ఒక మరమ్మతు పని జరుగుతూనే ఉంటుంది. మరుగుదొడ్లు మార్పులు చేర్పులు, కుర్చీలు మార్చడం, ఫ్లోరింగ్‌ మార్చడం, కొత్త లిఫ్ట్‌, టైల్స్‌ మార్చడం, చాంబర్లు మార్చడం ఇలా ఎప్పుడూ ఏదో ఒక పని జరుగుతూనే ఉండేది. ఇదంతా కేవలం ఉపాధి హామీ పనేనన్న విషయం రవిప్రకాష్ ను గెంటేసిన తర్వాత తేల్చిన లెక్కల్లో తెలిసిందట. ఖర్చు చేసింది లక్ష అయితే, నాలుగైదు లక్షల బిల్లులు పెట్టుకోవడం,నొక్కేయడం తరచూ జరిగేదన్న విషయం ఉద్యోగులకు సైతం తెలిసిపోయింది. కేవలం ఆఫీస్‌లో టీ బిల్లులే లక్షల్లో మింగేశారని ప్రచారం జరుగుతోంది. వినాయక చవితికి పెట్టే ప్రసాదాలు, బయట లైవ్‌ కవరేజ్‌ల కోసం పెట్టే ఖర్చులు,  ఇలా చెప్పుకుంటూ పోతే..ఛీ మరింత కక్కుర్తా అనేలా ఉద్యోగులే చీదరించుకుంటున్న పరిస్థితి tv9  లో వుంది

Tv9 సీఈఓ ముసుగులో రవిప్రకాష్ చేసిన అవినీతి,దందాలు, బ్లాక్ మెయిల్, మనీ లాండరింగ్,టాక్స్ ఎగవేతపై విచారణ జరిపించాలని ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ వెళ్లిందంటే రవిప్రకాష్  14 ఏళ్ల లో tv9 పేరు తో ఎంత మింగేశాడో ని చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!