రవిప్రకాష్ కు ‘సంజీవని’.. లబ్ధిదారులకు పంగనామం

సేవ పేరుతో విరాళాలు.. జనాలను ఉద్దరిస్తామన్న బీషణ ప్రతిజ్ఞలు.. మీడియాను చెరబట్టి.. జనాల సొమ్ముకు కన్నం పెట్టి గుండెజబ్బుల పిల్లలను ముందుపెట్టి ఓ మీడియా టైకూన్ శవాల మీద పాలాలు ఏరుకున్న వైనం విస్తుగొలుపుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. కావేవీ దోపిడీకి అనర్హం అన్నట్టు ఆ మాజీ సీఈవో చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ఆయన బాధితులు కథలు కథలుగా చెబుతున్నారు.

*రవిప్రకాష్ కు నిజంగా ‘సంజీవనీయే’..
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ టీవీ9 సీఈవోగా ఉన్నప్పుడు సేవ పేరుతో దోచుకున్న వైనంపై బాధితులు కథలు కథలుగా చెప్పుతున్నారు. వారి దీనగాథ విన్నాక రవిప్రకాష్ మోసాలు ఇన్నిన్ని కాదయా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు.
కృష్ణా జిల్లా కూచిపూడిలో రవిప్రకాష్ ‘సంజీవని’ పేరు ఆసుపత్రి ఏర్పాటు చేశారు. దీనికోసం మీడియా ముసుగులో దేశవిదేశాల్లో విరాళాలను పెద్ద ఎత్తున సేకరించారనే ఆరోపణలున్నాయి. రవిప్రకాష్ అండ్ బ్యాచ్ ఇప్పుడు సంజివనీ ఆస్పత్రి పేరుతో ప్రముఖులు, జనం సొమ్ములను సేవ పేరుతో ఎలా తమ సొంత ఖాతాలకు ఎలా మళ్లించారనే దానిపై విస్తుగొలిపేలా నిజాలు బయటపడుతున్నాయి. దీనిపై పోలీసులు, అధికారులు, సన్నిహితులు ఆరాతీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.

  • జనం సొమ్ములు తన సొంత ఖాతాల్లోకి..
    ఇక రవిప్రకాష్ ఫోర్జరీ ఉదంతం బయటపడడం.. పోలీసులు అరెస్ట్ చేశాక అతడిపై అధికారుల విచారణలో నమ్మలేని విషయాలు వెలుగుచూశాయట.. సంజీవని ఆసుపత్రి లో జరుగుతున్న అక్రమాలపై కృష్ణా జిల్లా వైద్యశాఖ అధికారుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటకొచ్చినట్టు సమాచారం. పదేళ్ల కిందట టీవీ9 లిటిల్ హార్ట్స్ పేరుతో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారుల ఆపరేషన్ల పేరిట విరాళాలు వసూలు చేసి దోచుకున్నారని అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. రవిప్రకాష్ సంజీవని ఆసుపత్రి పేరుతో జోలె పట్టి మరీ వసూళ్ళు చేశాడని ఇచ్చినవారు చెబుతున్నారు. జనం సొమ్ములను తన సొంత ఖాతాలలో మళ్లించారని అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నాయి.

*జోలెపట్టి.. జనానికి ఎగనామం బెట్టి..
సంజీవని ఆస్పత్రి ఏర్పాటు చేస్తామంటూ రవిప్రకాష్, ఆయన పార్ట్ నర్ కూచిబొట్ల ఆనంద్ కూచిపూడి వీధుల్లో విరాళాల పేరుతో ఆడిన జోలె డ్రామాలు ఏడాది కిందట జనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారు. ఇంటి ముందే ఉచిత వైద్యం అందిస్తామని రవిప్రకాష్, కూచిబొట్ల చెప్పిన విషయాలు మరిచిపోలేమని ఇప్పటికి తమకు గుర్తున్నాయని విచారణ కు వెళ్లిన అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

  • సంజీవని ఆస్పత్రికి వెళితే ప్రాణాలు హరీనే..
    కూచిపూడి లో నిర్మించిన రవిప్రకాష్ సంజీవని ఆసుపత్రికి లక్షకు పైగా దానం చేసిన దాత కు వారి కుటుంబ సభ్యులకు ఇదే ఆసుపత్రిలో జీవితకాలం పాటు అమెరికా స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని నాడు రవిప్రకాష్ బ్యాచ్ జనాలను నమ్మించింది. ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న గ్రామస్థుల వద్ద రవిప్రకాష్ బ్యాచ్ ఆసుపత్రి కోసం లక్షల్లో వసూలు చేశారని అధికారుల విచారణలో ప్రజలు వెల్లడించారు. రవిప్రకాష్‌ పిలుపుతో కూచిపూడికి చెందిన ఓ పెద్ద లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడు. ఇటీవల ఆ కుటుంబ పెద్ద కు హృద్యోగ సమస్య వచ్చి అత్యవసర చికిత్స కోసం రవిప్రకాష్ సంజీవని ఆసుపత్రి కి వెళితే సమయానికి వైద్యం అందక ఆ పెద్దాయన చనిపోయాడట.. కుటుంబం సభ్యులు ప్రభుత్వ అధికారులకు బ్యాంకు అధారాలతో సహా ఈ విషయం తెలుపడంతో సంజీవనీ ఆస్పత్రి మోసం కథ వెలుగులోకి వచ్చిందట..
  • ఆసుపత్రి కి విరాళంగా ఇస్తే ఐటీ మినహాయింపు అంటూ మోసం
    సంజీవని ఆస్పత్రికి విరాళం ఇస్తే ఇన్ కంటాక్స్ చెల్లింపు లో 18 C యాక్ట్ కింద మినహాయింపులు ఉంటాయని అబద్దపు హామీలతో రవిప్రకాష్ బ్యాచ్ నమ్మించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు వందల మంది తో లక్షలకు లక్షలు విరాళంగా రవిప్రకాష్ సంజీవని ఆసుపత్రి కి దాతలు చెల్లించారని బాధితులు చెబుతున్నారు. ఉచితంగా వైద్యం అందుతుందనే మంచి కారణం తో ఇచ్చిన విరాళాలు దారి మళ్లాయని లబ్ధిదారులు ఆరోపిస్తునా్నరు. అమెరికా నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ లను తీసుకొచ్చి ఉచిత వైద్యం అందిస్తామని చెప్పిన హామీలు ఇప్పుడు రవిప్రకాష్‌ సంజీవని ఆసుపత్రి లో మచ్చుకైనా కనిపించడం లేదని బాధితులు అక్కసు వెళ్లగక్కుతున్నారు. కూచిబొట్ల ఆనంద్ అమెరికా కథలు, రవిప్రకాష్ సమాజ సూక్తులు విని మోసపోయామని గుండెలు బాధుకుంటున్నారు.

*అరెస్ట్ తో రవిప్రకాష్ అక్రమాల గుట్టు బయటకు..
ఫోర్జరీ కేసులు, నిధుల మళ్లింపు కేసులో రవిప్రకాష్ అరెస్ట్ కావడం తో సంజీవని ఆసుపత్రి కోసం‌ సేకరించిన విరాళాలను కూడా రవిప్రకాష్ , కూచిబొట్ల ఆనంద్ స్వాహా చేసారనే విషయం మీడియాలో ప్రచారానికి వచ్చింది.. రవిప్రకాష్ అరెస్టు తర్వాత మీడియా సమావేశం పెట్టిన కూచిబొట్ల ఆనంద్ దాతల పేర్లను హడావుడిగా డిజిటల్ స్క్రీన్ పై ప్రచురించారు… అయితే స్క్రీన్ పై చూపిన పేర్లను , ఆ జాబితాను మీడియాకు నిర్భయంగా ఇవ్వకుండా పారిపోవడంతో కూచిబొట్ల ఆనంద్, రవిప్రకాష్ ల నిధుల స్వాహా పై అనేక అనుమానాలను బాధితులు వ్యక్తం చేశారు.

*ప్రజాసేవ పేరుతో దోచుకొని పంగనామాలు..
ప్రజాసేవ పేరుతో రవిప్రకాష్, ఆయన పార్ట్ నర్ ప్రజల సొమ్మును నమ్మించి తీసుకొని పప్పు బెల్లాలుగా పంచుకొని ఖాజేశారన్న విషయం తెలిసి ఇప్పుడు బాధితులు తీవ్రంగా కలత చెందుతున్నారట.. సంజీవని ఆస్పత్రికి విరాళాలు ఇచ్చిన వారంతా ఇదే విషయంపై నెత్తినోరు బాదుకుంటున్నారు. రాజకీయ నాయకులను మించి ఏడాది వ్యవధిలోనే రవిప్రకాష్ సంజీవని ఆసుపత్రి పేరుతో జనం నమ్మకాన్ని రూపాయలలోకి మార్చుకుని దోచుకోవడంపై బాధితులు ఆక్రోషం వెల్లగక్కుతున్నారు. కూచిపూడి వాసులు ,అమెరికా తో పాటు దేశ విదేశాల్లో వున్న దాతలు వీరిద్ధరి దోపిడిపై‌ కక్కలేక మింగలేక సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఇలా కథలు కథలుగా లీకులు ఇస్తున్నారు. వారి బాగోతాలు తెలిసి విస్తుపోవడం అందరి వంతు అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!