మరికొద్ది గంటల్లో గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం….

పూర్తైన గ్రామ సచివాలయ సిబ్బంది నియామకం

 గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనస్సుల్లో పుట్టిన గ్రామ సచివాలయం  ద్వారా గ్రామ స్వరాజ్యం ప్రారంభమవ్వనుంది. ఒకే గ్రామంలో వివిధ కీలక శాఖలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల  కనీస, నిత్యావసరాలను గ్రామ సచివాలయం ద్వారా తీర్చనున్నారు.ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో, ఆ తరువాత ఎన్నికల ప్రణాళికలో,  సీఎంగా బాధ్యతలు  చేపట్టిన మే 30న గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గాంధీ జయంతి అక్టోబర్‌ రెండు నుంచి ఇవి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడాలనే ఏకైక లక్ష్యంతో గత నాలుగు నెలలు గా  పరితపిస్తున్న సీఎం మాట నిల  బెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసేందుకు అనువుగా ఒక పక్క  భవనాలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం సోమవారం సిబ్బందికి  నియామకపత్రాలు అందచేసింది.  గ్రామ సచివాలయాలను తూర్పు గోదావరి జిల్లా కరపలో   సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు.

గ్రామ సచివాలయంలో పనిచేసే వివిధ శాఖల సిబ్బందిని ఎవరి సిఫారసుతోనో కాకుండా రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాని నిర్ణయించారు. అందులో భాగంగా 1.30 లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేస్తే 20 లక్షల మందికి పైగా అభ్యర్ధులు రాత పరీక్షకు హాజరయ్యారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షకు ఇంత మంది హాజరు కావటం రికార్డు. వీరే కాకుండా వార్డు, గ్రామ వాలంటీర్లను  కూడా ఎంపిక చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు వాంటీర్లు కలిసి ప్రజల వద్దకే వెళ్లి వారి వినతులు  పరిష్కరించటంతో పాటు రేషన్‌ను అందిస్తారు.

ఏ కార్యక్రమం ఆరంభంలోనైనా చిన్న చిన్న సమస్యలు సర్వ సాధారణం. అయితే అలాంటి సమస్యలు  కూడా  రాకూడదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముందుగానే గ్రామ సచివాలయాలు  సిద్ధం చేయటంతో పాటు ఫర్నిచర్‌, ఫోన్‌ వంటి వాటిని సమకూరుస్తోంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు  ఒకే దగ్గర ఉన్నట్లు గ్రామస్థాయిలో ఉండటం దేశంలోనే ఏపీలో తొలిసారి కావటం విశేషం. పరిపానా వికేంద్రీకరణకు ఇదో సులువైన మార్గం కూడా. ప్రజలకు నిత్యం అవసరమైన కీలక శాఖ అధికారులు, సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంటారు. సోమవారం గ్రామ సచివాయాల్లో పనిచేసేందుకు ఎంపికైన సిబ్బందికి నియామకపత్రాలు ఇస్తూ  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు సక్రమంగా జరిగేలా చూడాల్సిందిగా కోరారు. లబ్ధిదారుని కుం, మతం, పార్టీ అనేది  చూడకుండా వారికి న్యాయం చేయాలని, అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వం తాము నియమించిన పార్టీనేతలతో కూడిన జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన వారికే పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిన నేపధ్యంలో ఆ విమర్శలకు తావు లేకుండా చూడాల్సిందిగా సీఎం స్పష్టం చేశారు. గ్రామ వాలంటీర్లుగా చేరిన వారు మగవారు ఇళ్లలోలేని సమయంలో వెళ్లి తలుపు కొట్టి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని లేనిపోని ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న నేపధ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ వాలంటీర్ తన అనుభవాన్ని ఈ సందర్భంగా సోషల్‌ మీడియాతో పంచుకున్నారు.  ఓ 82 సంవత్సరాల ముదుసలికి రెండు సంవత్సరాలగా వృద్ధాప్య ఫించన్‌ అందటం లేదు. ఓ ఉపాధ్యాయుడికి తండ్రి ఐన ఆయన దీనావస్థ ఇది. కుమారుడి పరువు ఎక్కడ పోతుందోనని కొందరు కుటుంబసభ్యులే ఆయన పేరు వృద్ధాప్య ఫించన్‌ పథకంలో చేరకుండా అడ్డుకున్నారు. తాజాగా గ్రామ వాలంటీర్ ‌ ఆ ముదుసలిని కలిస్తే తన గాధను వినిపించి ఆదుకోవాల్సిందిగా కోరటంతో రెండేళ్లుగా పరిష్కారం కాని సమస్య రెండు నెలల్లో ఐంది.  గ్రామ సచివాలయాల ఏర్పాటు వల్ల   గత పాలకుల  హయాంలో పరిష్కారం కాని ఎన్ని సమస్యలు  పరిష్కారమౌతాయో పై ఉదాహరణను చూస్తేనే తెలుస్తుంది . గ్రామ సచివాలయాల పనితీరును సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి పర్యవేక్షించే వెసలుబాటు ఉంది. రాష్ట్ర వ్యాపితంగా 11,158 గ్రామ సచివాలయాలు , 3786 వార్డు సచివాలయాలు  మరికొన్ని గంటల్లో ప్రారంభమై నవశకానికి నాంది పలకనున్నాయి. సాధారణంగా ఏ ఊరికి చెందిన వ్యక్తి అదే ఊరిలో ఉద్యోగం పొందాలని కోరుకుంటారు. అయితే గ్రామ సచివాలయాల్లో మాత్రం అలా కాకుండా సీఎం జాగ్రత్త తీసుకున్నారు. ఏ ఊరి వ్యక్తి అదే గ్రామంలో ఉద్యోగం పొందితే రాగద్వేషాలతో పనిచేసే అవకాశం ఉందని భావించి వాటికి వ్యతిరేకంగా పనిచేయించాలనే ఉద్ధేశ్యంతో పరిసర గ్రామాల్లో నియమించేలా చర్యలు   తీసుకున్నారు. దీని వల్ల  వారు ఎలాంటి వత్తిడులు  లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు , పథకాలు  ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు  మెండుగా ఉన్నాయి.

ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి  ఆరు నెలల్లో  సుమారు లక్షన్నర  ఉద్యోగాలు  ఇవ్వటం ఓ రికార్డు. 2014 ఎన్నికలకు ముందు బ్రింగ్‌ బాబు బ్యాక్‌ బృందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ యావత్తూ సభలు, సమావేశాలు నిర్వహించి జాబు కావాంటే బాబు రావాలి అన్నారు. ఆ ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది కానీ నిరుద్యోగులకు  జాబు రాలేదు. అదే ఎన్నికల్లో నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. తాజాగా ఎన్నికల్లో ఓడిపోయే వరకూ ఆ హామీని ఆయన నెరవేర్చలేదు. ప్రతి చిన్న విషయానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకుని కొండంత లబ్ధి పొందాలనుకునే చంద్రబాబుకు పూర్తి విరుద్ధంగా తాను  చేయాలనుకున్న పని పూర్తికి  ఎవరు ఎన్ని అడ్డంకులు   సృష్టించినా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. సచివాలయ ఉద్యోగుల రాత పరీక్ష ఫలితాలు   వచ్చిన వెంటనే చంద్రబాబుకు బాకాలు   ఊదే పచ్చపత్రికలు , ఛానళ్లు వేసిన వీరంగాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవటమే దీనికి ఒక ఉదాహరణ. సాధారణంగా ఏదైనా పరీక్షా పత్రం లీక్‌ ఐతే పరీక్ష  జరిగిన రోజునే బైటకు వస్తుంది. లేదంటే ముందు రోజో, పరీక్ష జరిగే సమయంలోనో వస్తుంది. అందుకు పూర్తి విరుద్ధంగా ఫలితాల రోజున ప్రశ్నాపత్రం లీక్‌ అయంది. అదీ పచ్చ పత్రికలో. దీన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు బృందం ఊరూవాడ ఏకం చేసేలా ఎంత అల్లరి  చేసినా  ఫలితం మాత్రం గుండుసున్నా. దీన్ని బట్టి చూస్తే పచ్చ పత్రికలు , పచ్చ పార్టీ భవిష్యత్‌లో గ్రామ, వార్డు వాలంటీర్లు ,  సచివాలయ  సిబ్బందిపై ఎన్ని అభాండాలు  వేస్తారో అర్థమౌతోంది.  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలోంచి రూపుదాల్చిన ఈ గ్రామ సచివాయం విజయవంతమై ప్రజలు  ఆశీర్వదించి సొంతం చేసుకుంటే దేశ వ్యాపితంగా గ్రామ స్వరాజ్య స్థాపనకు బంగారు బాట  ఏపీ నుంచి మొదలైనట్లే….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!