ఎలక్ట్రిక్ బస్సులు: ఇదెక్కడి ఆరోపణ?

గ్లోబలైజేషన్ పుణ్యానా ఇప్పటికే కాంక్రీట్ వాతావరణం నుండి పొల్యూషన్ లోకి వెళ్లిన దేశాలన్ని వాతావరణాన్ని కాపాడుకునేందుకు తమ దేశాల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాయి.ముఖ్యంగా జనాభా తో పాటు పెరుగుతున్న వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్,పెట్రోల్ వాహనాలను తీసేసి ఎలక్ట్రానిక్ బైకులు ,బస్సులకు అలవాటుపడుతున్నారు..అక్కడి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు జనం‌కూడా మద్దతు ఇస్తూ అవే వాహనాలను చైనా ,జపాన్, సింగపూర్ ,మలేషియా ,నెదర్లాండ్ ఇలా అభివృద్ధి చెందుతున్నా దేశాలన్ని ఎలక్ట్రానిక్ వాహనేలే ముద్దు అంటున్నాయి. *మన దగ్గర ఢిల్లీలో వాతావరణం ఎంత కలుషితం అవుతుందో మనందరికీ తెలుసు.

ఎలక్ట్రానిక్ బస్సులంటే ఏంటి? ఎలా కేటాయిస్తారు

ఏ రాష్ట్రం లో నైనా ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులునే కొనుగోలు చేసే విధానమే లేదు.
కేంద్రం ప్రభుత్వం ఫేమ్-2 కింద దేశవ్యాప్తంగా 5000 బస్సులను కేటాయించింది.అందులో
350 బస్సులను ఏపీకి మంజూరు చేసింది. ఈ బస్సులను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగానే లీజు పద్ధతిలో ఉత్పత్తి సంస్థ నుంచి తీసుకొని 12 ఏళ్ళపాటు ఆ సంస్థలే నిర్వహిస్తే కిలోమీటర్కు నిర్ధారించిన ధర ప్రకారం చెల్లించే విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ఏడాదికి 3.98 కిలోమీటర్లు మేర ఈ బస్సులు నడపాలని ప్రతిపాదించారు. ప్రాథమికంగా కిలోమీటర్కు రూ. 39 చెల్లించాలని భావిస్తున్నారు. అయితే టెండర్లో ఏ సంస్థ తక్కువ ధరకు కోట్ చేస్తే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రకారం చెల్లిస్తారు

  • కేటాయింపులు ఎలా వుంటాయి?

కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల కోసం రానున్న మూడేళ్ళలో రూ. 10000 కోట్ల సహాయాన్ని రాష్ట్రాలకు ప్రకటించింది. అందులో భాగంగా 7000 బస్సులను అన్ని రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు కొనుగోలు/లీజుకు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 28న స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది మొత్తం 3545 కోట్లు ఈ-బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసింది. అయితే చంద్రబాబు నాయుడు ఏకంగా లేనిబడ్జెట్ను సృష్టించి అంతకన్నా రెట్టింపు అంటే 7500 కోట్లు ఒక్క ఏపీలోనే స్కాం జరుగుతోందంటూ విచిత్రమైన ఆరోపణలు చేశారు. కేంద్రం కేటాయించిన నిధులతో అన్ని రాష్ట్రాలు కలిపి 5595 బస్సులను సేకరించాలి. అందుకు 3545 కోట్లు కేంద్రం విడుదల చేస్తోంది. దేశ వ్యాప్తంగా గత రెండేళ్ళ నుంచి పది రాష్ట్రాలు విద్యుత్ బస్సులు నడిపేందుకు ముందుకు రాగా ఒలెక్ట్రా సంస్థ తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అద్దే ప్రతిపాదికన ఆయా రాష్ట్రాల ఆర్టీసీకి లీజుకు ఇచ్చింది. ఇవి విజయవంతంగా తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ,తెలంగాణాలలో కూడా ఇదే విధానం పాటించాలని నిర్ణయించారు*

తెలంగాణ లో ఇలా..ఏపి లో అలా

తెలంగాణ ఆర్టీసీ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ మేఘ ఇంజనీరింగ్ కంపెనీ స్వాహా చేసేస్తోంది అని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేఘ పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది.
మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు ఆర్జిచేసెస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్లతరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీ కి మార్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా?

అద్దె బస్సుల వల్లనే నష్టాలూ వస్తున్నాయనే ఆరోపణ నిజం కాదన్నది నిపుణుల వాదన.30 ఏళ్లగా అద్దె బస్సులు తీసుకుని నడుపుతోంది. సంవత్సరానికి 1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్ఠాల బాట పట్టిస్తోంది.

ఇపుడు తాజా ఆరోపణ ఏంటంటే ఓలెక్ట్రా (మేఘ ఇంజనీరింగ్కి చెందినది) కంపెనీ నుంచి కొనుగోలు చేసిన 40 ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వచేస్తున్నాయనేది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే.

ఎల్లో బురదను అందరికి పూస్తున్న U టర్న్ స్టార్

పోలవరం క్విడ్ప్రోకో పేరిట చంద్రబాబు నాయుడు అసలు లేని బడ్జెట్ను సృష్టించారా…? దేశంలో మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ మూడేళ్ళలో 3545 కోట్లు వ్యయం చేసేందుకు కేంద్రం నిర్ణయించగా ఆయన మాత్రం ఏకంగా ఏపీలోనే ఈ ఏడాది 7500 కోట్ల స్కామ్ జరుగుతోందంటూ ఆరోపించడంలో ఆంతర్యం ఏమిటి? అసలు ఆంధ్ర ప్రదేశ్ కు బస్సుల కొనుగోలులో స్వేచ్ఛ, అధికారాలు లేకపోయినప్పటికీ నేరుగా కొనేస్తుందంటూ ఆయన ఏ ఉద్దేశ్యంతో చెబుతున్నారు? అసలు రాష్ట్రాలకు లేని అధికారాన్ని ఆయన ఏకంగా సృష్టించి దానికి క్విడ్ప్రోకో అంటూ కొత్త నామకరణం చేసేసి తమ కాలంలో జరిగిన అక్రమాలు, అవకతవకల నుంచి బయటపడేందుకు కొత్త ఆరోపణలను తెరమీదకు తెచ్చారు.

ఇదెక్కడి ఆరోపణ?

ఇప్పుడు ఆయనే.. మేఘా నుంచి క్విడ్ ప్రోకో పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. మేఘా పెట్టుబడులు ఉన్న ఒలెక్ట్రా గ్రీన్టెక్ సంస్థలో ఉన్నాయి. పోలవరంలో ప్రధానమైన పనిని తక్కువ ధరకు అంటే 12.6శాతం తక్కువకు టెండర్ను మేఘా సంస్థ కోట్ చేసింది. ఈ పనికి సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున అది పరిష్కారమైతే తప్ప పనిని ఆ సంస్థకు అప్పగించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకులంతా పోలవరంలో వచ్చే నష్టాన్ని ఒలెక్ట్రా బస్సుల కొనుగోలు చేయడం ద్వారా క్విడ్ప్రోకో కింద 7500 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నారని ఆరోపిస్తున్నారు.

బాబు హయాంలో 2400 కోట్లు అక్రమాలు

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలవరం పనుల్లో 2400 కోట్ల మేర అక్రమాలు, అవకతవకలు జరిగాయని తద్వారా ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు బాగా లబ్ధిపొందారని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ వాటిని ఆధారాలతో సహా బయటపెట్టింది. దాంతో చంద్రబాబు ఐదేళ్ళ కాలంలో చేసిన అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయి. ఎన్నికల ప్రచార సమయంలో పోలవరాన్ని ఆయన ఏటీఎం కార్డుగా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడి ఆరోపించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. అదే సమయంలో ప్రాజెక్ట్ను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించి ఘోరంగా విఫలమయ్యారు. ఎంత వేగంగా చేసినా కనీసం మూడేళ్ళు పడుతుంది. ముంపునకు గురయ్యే బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు ప్రారంభించనే లేదు. ఈ పరిస్థితుల్లో తక్కువ ధరకు టెండర్ దాఖలు కావడం చంద్రబాబు నాయుడు అండ్ కో కు రుచించలేదు. ఆయనపై ఆరోపణలు రుజువయ్యే పరిస్థితి కనిపిస్తుండడంతో దానిని నుంచి బయటపడేందుకు ఒలెక్ట్రా బస్సుల క్విడ్ప్రోకోను తెరమీదకు తెచ్చారు. అందుకు పచ్చమీడియా విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ప్రజల మదిలో వాస్తవం అనిపించేందుకు ప్రయత్నిస్తోంది. కుక్కను చంపాలంటే ముందుగా పిచ్చిదనే ముద్రవేయాలనే వ్యూహంతో తెలుగుదేశం వెళుతోంది. అందులో భాగంగానే లేని బస్సుల కొనుగోలు, అసలు బడ్జెట్యే లేని మొత్తాన్ని ముందుకు తెచ్చారు.

*. దేశంలో ఈ-బస్సుల ఉత్పత్తి, తయారీలో ఒలెక్ట్రాతో పాటు టాటా, అశోకా లైలాండ్, మహేంద్ర మొదలైన సంస్థలు ఉన్నాయి. సెప్టెంబర్ 26న ఏపీఎస్ఆర్టీసీ నిర్వహించిన ప్రిబిడ్ సమావేశంలో 18 సంస్థలకు సంబంధించిన 27 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే వాటిలో చాలా కంపెనీల బస్సులు ఎత్తైన ప్రాంతాల్లో నడవలేని పరిస్థితి ఉంది. తిరుమల – తిరుపతి మధ్య ఒలెక్ట్రా బస్సులు మాత్రమే నడపడం సాధ్యమవుతుందనేది హిమాచల్ ప్రదేశ్లో మిగిలిన సంస్థల బస్సుల విఫలం కావడాన్ని బట్టి స్పష్టంగా చెప్పవచ్చని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానం కూడా తోడైంది. ఇంత స్పష్టమైన విధానం ఉన్నప్పటికీ మేఘాకు మేలు చేసేందుకు ఒలెక్ట్రా నుంచి విద్యుత్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తోందని చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపిస్తున్నారు. తాను పూసుకున్న బురదను ఎదుటి వాడికి కూడా పూసి వాడిపై బురద జెల్లాలని గేలి చేయడం చంద్ర బాబు కు వెన్నుపోటు తో పెట్టిన విద్య కనుక రానున్న రోజుల్లో తన బురదను అందరికి అంటిచడానికి పచ్చ మీడియా తో ఎన్ని కుట్ర లకైన తెర
లేపుతాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!